Jagannanna Cheddodu Scheme Full Details - volunteer info
పథకం పేరు : జగనన్న చేదోడు పథకం
పథకం యొక్క ముఖ్య ఉద్దేశం
సొంత షాపు కలిగిన రజకులకు, నాయి బ్రాహ్మణులకు మరియు టైలర్లకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్నందించడం.
అర్హతలు
• ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000/- కంటే తక్కువ ఉండాలి.
• మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండూ కలిపి 10 ఎకరాలకు మించరాదు.
• కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.
• పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
• ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.
• ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కుల ధ్రువీకరణ పత్రాన్ని (SC, ST, BC, Minority, EBC) కలిగి ఉండవలెను.
• ఏ కులానికి చెందిన వారైనప్పటికీ పూర్తిగా టైలరింగ్'నే ప్రధాన వృత్తిగా స్వీకరించి జీవనోపాధి చేయుచూ.. సొంత షాపు కలిగిన టైలర్లు ఈ పథకానికి అర్హులు.
• కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే ఈ పథకానికి అనర్హులు.
• కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా సొంత వాహనంగా ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల వాహనం) ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. ఆటో టాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.
అనర్హతలు
* మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేదా మెట్ట మరియు మాగాణి భూములు రెండు కలిపి 10 ఎకరాలు మించి ఉన్న వారు అనర్హులు.
* పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ కలిగి ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.
* కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే ఈ పథకానికి అనర్హులు.
• కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా సొంత వాహనంగా ఫోర్ వీలర్ (నాలుగు చక్రాల వాహనం) ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. ఆటో టాక్సీ మరియు ట్రాక్టర్లకు మినహాయింపు కలదు.
కావలసిన పత్రాలు
• బ్యాంక్ ఖాతా పుస్తకం.
• ఆధార్ కార్డు,
• ఆదాయ ధ్రువీకరణ పత్రం
• కుల ధ్రువీకరణ పత్రం
జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకునే విధానం
➤ గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తారు. పారదర్శక విధానంలో గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తారు.
➤ గ్రామ సభల ద్వారా అర్హులందరికి మేలు జరిగేలా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిరంతర సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శిస్తారు.
➤ అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరులేని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేసీ విధానం సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
➤ ఎవరికైనా అర్హతలున్నప్పటికీ పొరపాటున జాబితాలో పేరు లేకపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూపి, తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి నెలలో ఆమోదముద్ర వేసి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.