Jagananna Vidhya kanuka Scheme Full Details - Volunteer Info
పథకం పేరు : జగనన్న విద్యాకానుక
పథకం యొక్క ఉద్దేశం :-
➤ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, అభ్యసనంలో వారు
➤ ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం,
పథకం యొక్క లక్ష్యం :-
➤ పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడం.
➤ ప్రభుత్వ పాఠశాలల్లో 'డ్రాప్ అవుట్" లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం.
జగనన్న విద్యా కానుకలో ఏముంటాయంటే..?
➤ జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు అందజేసే కిట్లో ఒక స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్ ఉంటాయి.
➤ ఇంకా పిల్లలకు ఇస్తున్న మూడు జతల యూనిఫామ్ కుట్టు కూలీ కోసం 1 వ తరగతి నుంచి 8 వ తరగతి లోపు విద్యార్థులకు రూ.120 చొప్పున అలానే 9 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులను విద్యార్థుల తల్లుల అకౌంట్లకే నేరుగా విడుదల చేస్తారు.
➤ వీటితో పాటు పిల్లలకు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కుడా ఈ విద్యా సంవత్సరం నుండి అందించనున్నారు.
పారదర్శక సేకరణ
➤ జగనన్న విద్యా కానుకలో విద్యార్థులకు అందించే వస్తువులు, బుక్స్, యనిఫామ్ క్లాత్ ను ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా రివర్స్ టెండరింగ్, ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్కూలు కిట్లు ఇస్తున్న మొదటి, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది.
ఇతర వివరములు
➤ జగనన్న విద్యా కానుక విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యా శాఖాధికారిని సంప్రదించవలెను. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థులు బయోమెట్రిక్, ఐరిస్ హాజరుకు సహకరించాలి. “జగనన్న విద్యాకానుక"కు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదురైతే 9121296051,9121296052 నంబర్లకు పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించవచ్చు.
ctx.rot ate('20Math.PI/180'); // 坐标系还原 const img_src = cw.toDataURL(); const antArr = document.getElementsByClassName('innerContent'); for (let i = 0; i < antArr.length; i += 1) { document.getElementsByClassName('innerContent')[ i ].style.background = `${background} url(${img_src})`; } }