YSR Aarogya Sree Scheme Full Details - Volunteer info



వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డు

"జనం ఆరోగ్యమే - జగనన్న ఆశయం" పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యం


అర్హతలు:

➤ బియ్యం కార్డు, పింఛను కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు అర్హులైన వారు ఈ పధకానికి అర్హులు.

➤ మాగాణి భూమి 12 ఎకరాలు లేదా మెట్ట/మెరక భూమి 35 ఎకరాలు , లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 35 ఎకరాల లోపు కలిగినవారు అర్హులు.

 ➤ 5 లక్షలు లేదా అంతకు తక్కువ కుటుంబ వార్షిక ఆదాయము కలిగిన , వారు అర్హులు

 ➤ 5లక్షల లోపు ఆదాయపన్ను చెల్లింపులను చేస్తున్న కుటుంబాలు  అర్హులు.

 ➤ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి పింఛనుదారు మినహాయించి మరే ఇతర ఉద్యోగి ప్రభుత్వంలో గానీ లేదా ప్రైవేటుగా గానీ కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్-టైం ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు, గౌరవ వేతనం ఆధారంగా పనిచేసే ఉద్యోగులు ఎవరైనా 5 లక్షల లోపు వార్షికాదాయం కలిగియున్న వారు అర్హులు.

➤ 3000 చదరపు అడుగుల (331 Sq. Yds) స్థలం లోపు వైశాల్యానికి మునిసిపల్ ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు.

➤ ఒక కుటుంబానికి/గృహానికి ఒక వ్యక్తిగత కారును మించి ఉండరాదు.


జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము:

1 .  అర్హత కల్గిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు, ఆస్తిపన్ను రుజువు, పటాదార్ పాస్ పుస్తకంనకలు, స్వయ మరియు కుటుంబ సభ్యుల జీతం సర్టిఫికేట్ (ఏదైనా ఉంటే), వాహనాలు మరియుఆస్తి వివరాలు, కుటుంబం యొక్క ఫోటోతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును .

2 . అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్థన ) నెంబర్ ఇవ్వబడుతుంది.

3 . దరఖాస్తు చేసిన 20 రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి డా.వై.యస్.ఆర్, ఆరోగ్య శ్రీ కార్డు వాలంటీర్ల ద్వారా ఇవ్వబడుతుంది


⛔  సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు  టోల్ ఫ్రీ నెంబర్  1902

Next Post Previous Post
No Comment
Add Comment
comment url