YSR Kapu Nestam Scheme Full Details - Volunteer Info


వైయస్సార్ కాపు నేస్తం పథకం 2021-22

పథకం యొక్క ఉద్దేశం :-


కాపు సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించడం.


ప్రయోజనాలు :-

• అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం.

• మొత్తం ఐదేళ్ల పాలనలో 75 వేల రూపాయల ఆర్థిక సాయాన్నందించడం


అర్హతలు :-


• 45 ఏళ్ల నుంచి  60 ఏళ్లలోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్థులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

• కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి.

• కుటుంబానికి గరిష్టంగా మూడెకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట రెండూ కలిపి పదెకరాలకు మించరాదు.

* పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారు.

* ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం కలిగి ఉండొచ్చు.

• కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే.


అనర్హతలు :-


• కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు.

• పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న వారు ఈ పథకానికి అనర్హులు.

• కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.

• ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.

• కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులు.


కావలసిన పత్రాలు :-


• ఆధార్ కార్డు.

• కుల ధ్రువీకరణ పత్రం.

• ఆదాయ ధ్రువీకరణ పత్రం.

• నివాస ధ్రువీకరణ పత్రం.

• వయసు నిర్ధారణ పత్రం


ఇతర వివరములు :-

డబ్బులు ఖాతాలో పడగానే లబ్ధిదారుల ఫోనుకు సందేశం వస్తుంది.

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేనివారు ఉంటే గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తరువాత అర్హులైన వారికి కూడా తప్పనిసరిగా ఆర్థిక సాయం అందిస్తారు.

Next Post
No Comment
Add Comment
comment url